రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ రంజన్ గొగోయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారిని శనివారం రాత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ దర్శించుకున్నారు. సాయంత్రం తిరుమలకు చేరుకున్న న్యాయమూర్తి స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్న తరువాత తిరిగి ఆలయంలోకి తీసుకు వెడుతున్న ఉత్సవ మూర్తుల పల్లకిని మోశారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయనకు అదనపు ఈఓ ధర్మారెడ్డి, అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు.

*చిత్రాలు.. తిరుమలలో శ్రీవారి పల్లకి మోస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్
*తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ దంపతులు