రాష్ట్రీయం

ప్రజల్లో ధార్మిక చింతన పెంచాలి: టీటీడీ చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 16: ప్రతి పౌరుడులోనూ ధార్మిక చింతన పెంచేలా స్వామివారి వైభవాన్ని, వైశిష్ట్యాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తూ ప్రతి అణువూ గోవిందనామస్మరణలతో మార్మోగేలా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బెంగళూరులో స్థానిక టీటీడీ సలహామండలి సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశం మాజీ ఎంపీ కుబేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరూ అందుకునేలా ధార్మిక కార్యక్రమాలను చేపట్టాలని ఆయన కమిటీని ఆదేశించారు. ప్రత్యేక ఉత్సవాలకు సంబంధించి ఏవైనా చేపట్టేముందు టీటీడీ అనుమతి పొందాలని సూచించారు. ఆలయాల నిర్వహణలో లోపాలు ఉంటే గుర్తించి టీటీడీ సహకారంతో సవరించాలన్నారు. సలహాకమిటీలో ఉన్న సభ్యులు స్వతంత్రంగా ధన, వస్తు, కానుకలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆలయ విధివిధానాల్లో కమిటీ సభ్యులు జోక్యం చేసుకోకూడదన్నారు. ఆలయాలకు సంబంధించిన ఏవైనా ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలనుకున్నపుడు సలహాలివ్వడానికే పరిమితం కావాలన్నారు. తద్వారా టీటీడీ ప్రతిష్టను ఇనుమడింపచేసేలా ప్రతి సభ్యుడు హుందాగా ఉండాలన్నారు.