రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 17: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు ఆదివారం ఉదయం మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులకు టీటీడీ ఈఓ ఏ.కె.సింఘాల్, అదనపు ఈఓ ఏ.వి.ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఈఓ, అదనపు ఈఓలు శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, విజిఓ మనోహర్, పేష్కార్ లోకనాథం పాల్గొన్నారు.
*చిత్రం... తిరుమలలో ఆదివారం శ్రీవారి ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ దంపతులు