రాష్ట్రీయం

ప్రజలపై జగన్ సర్కారు కక్ష సాధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, నవంబర్ 17 : రాష్ట్రంలో అధికారంలో వున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలో ఆదివారం కన్నా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో దాడులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమాలు, పోలీసు కేసులు, అవినీతి ఎలా జరిగాయో అదే దారిలో ప్రస్తుత జగన్ సర్కారు కూడా నడుస్తోందన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ఏమీ కనిపించడం లేదన్నారు. గోరంట్ల సమీపంలోని జీనులకుంట గ్రామంలో గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లు మంజూరు చేయగా అవి నిర్మాణ దశలో వుండగా వాటిని వైసీపీ ప్రభుత్వం జేసీబీ ద్వారా కూల్చివేస్తుండడం తాను కళ్లారా చూశానన్నారు. నిరుపేదలకు ఏ పార్టీతో సంబంధం లేదని, 2014లో టీడీపీకి పట్టం కడితే, 2019లో వైసీపీకి అధికారం ఇచ్చారన్నారు. నాయకులకు పార్టీలు ఉండవచ్చు కానీ ప్రజలు మాత్రం ఎవరు బాగా పని చేస్తే వారికే పట్టం కడతారన్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు గ్రహించాలన్నారు. చేతనైతే గత ప్రభుత్వం కంటే ఎక్కువగా అభివృద్ధి చేయాలేకానీ పేదలపై గూండాగిరి చేయడం పద్ధతి కాదన్నారు. అధికారులు ఇటువంటి చర్యలను ప్రోత్సహించకుండా అరికట్టాలని సూచించారు.
వంశీ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం
కదిరి పట్టణం చుట్టూ రింగు రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ స్థానిక అంబేద్కర్ కూడలిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వంశీ దీక్షకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర నాయకులు ఎంఎస్ పార్థసారధి, జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ