రాష్ట్రీయం

డిసెంబర్ 11న తిరుమలలో దీపోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 18: తిరుమల శ్రీవారి ఆలయంలో తమిళ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 11వ తేదీన సాలకట్ల కార్తీకై దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఆనాడు నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఈ సందర్భంగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజ స్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహ స్వామి, విష్వకేన్సులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమల రాయమండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయ స్వామి, వరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా తమిళ నెలల ప్రకారం కార్తీకై పౌర్ణమి డిసెంబర్ 11న జరుగుతుంది. ఈ దీపోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 11వ తేదీన శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది.