రాష్ట్రీయం

దేవుడిని అవమానించినా టీటీడీ చైర్మన్ స్పందించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 18: తిరుమల తిరుపతి పవిత్రతపైన, దేవదేవుడిపైనా మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేసినా టీటీడీ చైర్మన్ స్పందించకపోవడం దారుణమని టీడీపీ నేత అమర్‌నాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హిందువుల మనోభావాలను మంత్రి కొడాలి నాని కించపరచినా ఇంతవరకు టీటీడీ బోర్డు చైర్మన్ స్పందించలేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచార సాంప్రదాయాలు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే బోర్డు సభ్యులు ఎందుకు స్పందించరన్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా కలియుగదైవానే్న ఉద్దేశించి మాట్లాడటం సరికాదన్నారు.