రాష్ట్రీయం

శ్రీశైలంలో వేడుకగా లక్ష దీపోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్: కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో లక్ష దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని పుష్కరిణివద్ద సోమవారం రాత్రి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. అంతకుముందు పుష్కరహారతి ఇచ్చారు. మూడవ సోమవారం శ్రీగిరికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే పాతాళగంగలో స్నానాలు ఆచరించిన భక్తులు కార్తీకదీపాలు వెలిగించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులుతీరారు. ఆలయం ముందుభాగం, పుష్కరిణి, నాగలకట్ట, గంగాధర మండపం వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.
*చిత్రం... లక్ష దీపోత్సవం నిర్వహించిన దృశ్యం