రాష్ట్రీయం

సంకల్ప బలంతోనే సాధికారత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 19: మహిళలు సంకల్ప బలాన్ని పెంచుకుని, సాధికారత దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందరరాజన్ పిలుపునిచ్చారు. పుట్టపర్తి సత్యసాయి బాబా 94వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రశాంతి నిలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సులో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సత్యసాయి బాబా జయంతి వేడుకలకు హాజరుకావడం తన అదృష్టమని అన్నారు. భగవాన్ సత్యసాయి బాబా ఇలాంటి ప్రత్యేక దినంపై తన దివ్యదృష్టి సారించి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని కొనియాడారు. దశాబ్దాల క్రితమే సత్యసాయి బాబా తన విద్యాలయాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని, అందులో భాగంగా మహిళా విద్యాలయాలు ప్రత్యేకంగా స్థాపించారని శ్లాఘించారు. అలాగే సత్యసాయి బాబా భక్తురాలిగా తనకున్న భక్తి ప్రపత్తులను గవర్నర్ వివరించారు. తాను సత్యసాయిబాబాకు ఎప్పటి నుంచో భక్తురాలనని, చెన్నైలోని ‘సుందరం’లో సత్యసాయి మందిరాన్ని సందర్శించేదానిని అని అన్నారు. ప్రతి గురువారం సుందరం వెళ్లి బాబా విభూదిని నుదుట పెట్టుకునే దానినని గుర్తు చేసుకున్నారు. భౌతికంగా సత్యసాయిబాబాను సందర్శించాలన్న తన కోరిక నెరవేరకపోయినా, ఇప్పుడు ఆ మహనీయుడి మహాసమాధి దర్శనంతో తన కల నెరవేరిందన్నారు. సత్యసాయి భక్తురాలిగా, వైద్యురాలిగా గవర్నర్ హోదాలో నేడు తాను ఇక్కడికి రావడం బాబా సంకల్పమేనన్నారు. ఒక మహిళగా గౌరవ ప్రదమైన హోదాలో రాజకీయాల్లో సేవలందించడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహకారంతో బీజేపీలో అంచలంచెలుగా ఎదిగానన్నారు. సత్యసాయి సేవలు
అమోఘమన్నారు. ఆయన స్థాపించిన వైద్యాలయాల్లో పేదలకు అందిస్తున్న ఉచిత సేవలను కొనియాడారు. దేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా, వివిధ విభాగాలు ఉంటాయని, అందులో బిల్లింగ్ ఉంటుందని, అందుకు భిన్నంగా సత్యసాయి ఆస్పత్రిలో లేనిది బిల్లింగ్ విభాగమేనన్నారు. బాబా చేసిన ఆధ్యాత్మిక బోధనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయన్నారు. బాబా సేవలు ఎనలేనివన్నారు. హాంకాంగ్‌కు చెందిన సత్యసాయి భక్తురాలు విషాబల్ ఘాతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సత్యసాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ విశిష్టతను చాటి చెబుతూ పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక, సంగీత కచేరీలు నిర్వహించారు.

*చిత్రం... ప్రశాంతి నిలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సులో ప్రసంగిస్తున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందరరాజన్