రాష్ట్రీయం

ఇది అదృశ్యం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాకిస్తాన్‌లోకి పొరపాటున ప్రవేశించిన హైదరాబాద్ నగర యువకుడు ప్రశాంత్ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇది కేవలం అదృశ్యమైన కేసు మాత్రమేనని, దీనిపై వందతులు వ్యాప్తిచేసినా, అసత్య ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో అదృశ్యమైన ఐటీ ఉద్యోగి ప్రశాంత్ పాకిస్తాన్ అధికారులు అరెస్టు చేశారని తెలియడంతో, ఆయన తండ్రి బాబురావు సైబరాబాద్ సీపీని కలిశారు. తన కుమారుడిని క్షేమంగా రప్పించేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా సీపీ విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రశాంత్ ఎలా భారత సరిహద్దు దాటాడనే విషయంపై ఇరు దేశాల అధికారులు దర్యాప్తు చేసున్నట్లు వెల్లడించారు. 10 నెలల క్రితమే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ‘రా’ ఏజెంట్లు ప్రశాంత్ తండ్రి బాబురావును కలిశారని, వివరాలు సేకరించారని సోషల్ మిడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నదని సీపీ చెప్పారు. ఇలావుంటే, తన కుమారుడు కనిపించడం లేదని 2017 ఏప్రిల్ 29న బాబురావు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్ఫోటెక్ సంస్థలో పని చేస్తున్న తన కుమారుడు ప్రశాంత్ 2017 ఏప్రిల్ 11న ఉదయం 9 గంటలకు డ్యూటీకి
వెళ్తున్నానని ఇంటి నుండి వెళ్లాడని, అప్పటి నుండి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశాంత్ ఆచూకీ కోసం సుమారు ఏడాది గాలించిన పోలీసులు ఎలాంటి సమాచారం లభించకపోవడంతో కేసును మూసివేశారు.
ప్రేమలో విఫలమే కారణం?
ప్రశాంత్ రెండేళ్ల క్రితం ఓ యువతితో ప్రేమాయాణం సాగించాడని.. అది ఫలించకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని బాబూరావు తెలిపారు. ఆ కారణంగానే పొరపాటున పాకిస్తాన్‌లోకి అడుగు పెట్టి ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమారుడు అమాయకుడని, ఉగ్రవాద కార్యకలాపాలతో అతనికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. తొలుత మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసిన ప్రశాంత్ ఆ తర్వాత బెంగుళూరుకు వెళ్లాడని తెలిపారు. అక్కడే తన కుమారుడు ప్రేమలో పడినట్టు బాబూరావు చెప్పారు. విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ కుటుంబం ఆరేళ్లుగా కూకట్‌పల్లిలోని భగత్‌సింగ్‌నగర్‌లో నివాసం ఉంటున్నది. పాకిస్తాన్‌లో అక్రమంగా ప్రవేశించారనే కారణంపై ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన హరీలాల్ అనే మరో వ్యక్తిని ఈ నెల 14న పాకిస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పాక్ పోలీసులు అక్రమ చొరబాట్లకు సంబంధించి కేసులు నమోదు చేశారు. అయితే, పాక్ భూభాగంలోకి చొరబడాల్సిన అవసరం ప్రశాంత్‌కు ఏమాత్రం లేదని, అతను అలాంటి వ్యక్తి కాడని బాబూరావు అన్నారు. ఇదే అంశాన్ని ఢిల్లీలోని రాయబార కార్యాలయానికి వెళ్లి వివరిస్తామని, తన కుమారుడిని క్షేమంగా అప్పగించాలని కోరుతామని వెల్లడించారు.
*చిత్రం...సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను ప్రశాంత్ తండ్రి బాబురావు