రాష్ట్రీయం

దొడ్డిదారిన స్కూళ్ల కుదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: విద్యా హక్కు చట్టానికి సవరణ పేరుతో ప్రభుత్వం దొడ్డిదారిన స్కూళ్ల కుదింపునకు పూనుకుంది.పాఠశాలలను కుదించి పేద ప్రజలకు విద్యను దూరం చేయవద్దని టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రఘునందన్ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే విద్యా హక్కు చట్టానికి సవరణ పేరుతో పాఠశాలల సంఖ్యను భారీ సంఖ్యలో కుదించడం ద్వారా మూసివేతకు కొత్త ఎత్తుగడను పన్నిందని రఘునందన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి నివాస ప్రాంతానికీ కిలోమీటరు దూరంలో ప్రాధమిక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రాధమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్నత పాఠశాల ఉండాలని, అయితే ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా విద్యా హక్కు చట్టంలోని నిబంధనలను సవరించుకోవచ్చని పేర్కొందని గుర్తుచేశారు. ఐదు కిలోమీటర్లు లోపు ఏదో ఒక రకమైన పాఠశాల ఉంటే చాలనే అర్ధం వచ్చేలా విద్యా హక్కు చట్టానికి సవరణలు చేయాలని యోచిస్తోందని ఇది సరికాదని అన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇలాంటి సవరణలు చేయడం వల్ల రాష్ట్రంలో సగానికి పైగా స్కూళ్లు మూసివేయాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వ విద్యారంగం ఉనికిలో లేకుండా పోతుందని, గత సంవత్సరం పాఠశాలల రీ లొకేషన్ పేరుతో నాలుగు వేల స్కూళ్లను మూసివేశారని అన్నారు. గతంలో రేషనలైజేషన్, రీ లొకేషన్, ఇపుడు ఆవాస ప్రాంతల పరిధి మార్పు ఇలా రకరకాల ఎత్తుగడలతో స్కూళ్లను మూసివేస్తున్నారని అన్నారు. ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించడం ద్వారా దేశంలోనే ఆదర్శవంతమైన విధంగా పాఠశాలల నిర్వహణ ఒక దిక్కు ఉంటే అలాంటి చర్యలు చేపట్టకపోగా ఏడాదికేడాది రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు తగ్గిస్తూ ప్రభుత్వ బడులు పనికిరాకుండా పోతున్నాయని అన్నారు.