రాష్ట్రీయం

అటవీ అభివృద్ధికి ‘ ఫారెస్ట్ ప్లస్ 2.0’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: అడవుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అటవీ అభివృద్ధికి అమెరికా సాయంతో చేపట్టిన ‘ ఫారెస్ట్ ప్లస్ 2.0’ కార్యక్రమాన్ని బుధవారం ఆయన జ్యోతి వెలిగించి, లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రకృతిని, పర్యావరణాన్ని కలుషితం చేసి, రక్షణ చర్యలు చేపట్టడం కంటే, ప్రస్తుతం ఉన్న అడవులు, నీటి వనరులను యధాతథంగా కాపాడుకోవాల్సి ఉందన్నారు. క్షీణించిన అడవుల పునరుద్దరణ, రాష్ట్రం మొత్తంలో పచ్చదనం పెంపొందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. అడవులు, జీవావరణ వ్యవస్థను కాపాడుకుంటేనే మనిషికి మనుగడ ఉంటుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అడవుల పునరుజ్జీవనం, వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని యూఎస్ ఎయిడ్ మిషన్ డిప్యూటీ డైరెక్టర్ రమనో ఎల్ హమ్జానీ శ్లాఘించారు. పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు, అడవుల విస్తీర్ణం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం బాగుందని ఆమె పేర్కొన్నారు. అడవుల సమగ్ర అభివృద్ధి, నీటి వనరుల సంరక్షణకు తోడు అడవులపై ఆధారపడి జీవించేవారి ఆర్థిక ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా యూఎస్ ఎయిడ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సంయుక్తంగా ‘ ఫారెస్ట్ ప్లస్-2.0’ ను అమలు చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి 2021 నుండి 2030 వరకు అంతర్జాతీయ పర్యావరణ, జీవావరణ వ్యవస్థల పునరుద్దరణ దశాబ్దంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ సహకారంతో మూడు రాష్ట్రాల్లోని మూడు అటవీ సర్కిళ్లలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర అటవీ శాఖ అమలు చేస్తోంది.
*చిత్రం... ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి