రాష్ట్రీయం

ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌లపైజోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించేవిధంగా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీలు కోరాయి. బుధవారం ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ జే గీతారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీజేపీ నేత మోహన్‌రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ రాజకీయ పార్టీలపై ఇష్టం వచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొనడం తగదని ఫిర్యాదు చేశారు. గీతారెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ, కేసీఆర్ కార్మికుల పట్ల కఠిన వైఖరిని మానుకోవాలని హితవుపలికారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఆర్టీసీ కార్మికుల పట్ల దయలేకుండా వ్యవహరించడం కేసీఆర్‌కు తగదన్నారు. కార్మికులను పిలిచి మాట్లాడాలన్నారు. ఆర్టీసీ కార్మికులు 48 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం హృదయ విదారకంగా ఉందన్నారు. వారికి రెండు నెలలుగా జీతాలు లేవన్నారు. వారి కుటుంబ సభ్యులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. సీపీఐ కార్యదర్శి చాడవెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ప్రధాన డిమాండ్‌ను వదులుకున్నారని, వారిని కాకికి కబురుపెట్టినా చర్చలకు వస్తారన్నారు. సునీల్ శర్మ టీఆర్‌ఎస్ పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. ఇంతవరకు 28 మంది కార్మికులు మరణించారన్నారు. అయినా కేసీఆర్‌కు కనికరం లేదన్నారు.
*చిత్రం... గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు వినతిప్రతం సమర్పిస్తున్న అఖిలపక్షం నేతలు