రాష్ట్రీయం

‘రివర్స్’పై బాబుకెందుకు బాధ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభమైతే సంతోషపడకుండా ద్వేషాన్ని వెళ్లగక్కడం టీడీపీ అధినేత చంద్రబాబుకు తగదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ చంద్రబాబు పోలవరం టెండర్లను రకరకాలుగా మార్చారన్నారు. రివర్స్ టెండర్ల వల్ల రాష్ట్రానికి లాభం జరిగిందన్నారు. చంద్రబాబు దిగిపోయే సమయంలో రూ.40వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈ రోజు జగన్ సర్కార్‌ను విమర్శిస్తారా అని నిలదీశారు. పేదరిక నిర్మూలన, ఆకలి, సమానత్వం ఇలా 17 లక్ష్యాల్లో ఏపీ నెంబర్ 1 అని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు అన్యాయంగా మాట్లాడుతున్నారన్నారు. అమరావతి వరల్డ్ క్లాస్ సిటీ నిర్మిస్తుంటే, తాము అడ్డుకున్నామని మాట్లాడమేంటన్నారు. హైదరాబాద్‌ను తానే కట్టేనని చెప్పుకోవడం చూస్తుంటే బాబుకు మతిభ్రమించిందన్నారు. విద్య, వైద్యం, వౌలిక సదుపాయాల కల్పన అంశాలపై తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యుత్ సంస్థల పీపీఏల విషయంలో హడావుడిగా ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారన్నారు. ప్రజల సొమ్మును కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. ఇసుక దోపిడీకి గతంలో చంద్రబాబు సర్కార్ పాల్పడిందన్నారు. లిక్కర్ విషయంలో పక్కాగా ముందుకెళుతుంటే అన్యాయంగా మాట్లాడడమేంటన్నారు. 4380 మద్యం దుకాణాలను మూడువేలకు తగ్గించామన్నారు. అన్ని వర్గాల పేదలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతుంటే విమర్శించడమెందుకన్నారు. టీడీపీ నేతలు నోటికి వచ్చనట్లు మాట్లాడితే సింగారం, ఇతరులు ఎవరు మాట్లాడినా ఆంబోతులని అంటారా అని అడిగారు. చంద్రబాబు నోరు జారి మాట్లాడడం తగదన్నారు. జగన్ సర్కార్ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
*చిత్రం... ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్