రాష్ట్రీయం

వరాహస్వామి ఆలయ గోపురానికి స్వర్ణ వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉన్న ఆనంద నిలయం ఎలా అయితే స్వర్ణకాంతులను వెదజల్లుతుందో అదే తరహాలో క్షేత్రపాలకుడుగా కొలువుదీరిన భూ వరాహస్వామి ఆలయ గోపురాన్ని కూడా స్వర్ణమయం చేసే ఆలోచనలో టీటీడీ అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి అక్టోబర్‌లో తిరుమలలో జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రూ.14 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ స్వర్ణ తొడుగుల అమరికకు సంబంధించి ఫైనాన్స్ కమిటీ ముందు ఆమోదం కోసం ప్రతిపాదనలు ఉంచారు. కమిటీ ఆమోదముద్ర వేయగానే ఇందుకు సంబంధించి పనులు చేపట్టే అవకాశం ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువుదీరడానికి క్షేత్రపాలకుడైన భూ వరాహస్వామి అనుమతించినట్లు పురాణాలు ఉటంకిస్తున్నాయి. అందుకే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా భూ వరాహస్వామిని దర్శించుకునేలా నాడు స్వామివారు వరం ప్రసాదించారని ప్రతీతి. ఈక్రమంలోనే శ్రీవారి భక్తులు ముందుగా శ్రీ భూ వరాహస్వామిని దర్శించుకోవాలని ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్న విషయం విదితమే. గత కొంతకాలంగా తిరుమలకు వస్తున్న రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధాని, గవర్నర్లు, ముఖ్యమంత్రి ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ భూ వరాహస్వామిని దర్శించుకుంటున్నారు. వాస్తవానికి తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా భూ వరాహ స్వామిని దర్శించుకుని అటు తరువాత స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలనే యోచనను టీటీడీ అధికారులు చేశారు. అయితే అందుకు తగిన సౌలభ్యం లేని పరిస్థితిలో ఆ ఏర్పాట్లు జరగని పరిస్థితి. ఈనేపథ్యంలో భూ వరాహ స్వామి ఆలయ ప్రాశస్త్యాన్ని భక్తులకు మరింత చేరువగా తీసుకువెళ్లేందుకు టీటీడీ యాజమాన్యం పలు రకాలుగా యోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే భూ వరాహ స్వామి కొలువుదీరి ఉన్న ఆలయ గోపురానికి స్వర్ణ తొడుగులను అమర్చాలనే బృహత్తర కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. ఇందుకు సంబంధించి 42.43 కిలోల బంగారం, 18 కిలోల రాగిరేకులు అవసరం ఉంటాయని అంచనా వేసింది. ఇందులో బంగారు రేకుల వినియోగానికి రూ. 13.15 కోట్లు, రాగిరేకుల వినియోగానికి రూ.11.16 లక్షలు వ్యయమవుతుందని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా డిజైన్ కూడా టీటీడీ సిద్ధం చేసింది. ఇక బంగారుపూత వేయడం, అమర్చడం తదితర పనులకు కూలీ కింద రూ.21.04 లక్షలు అంచనా వ్యయం. అలాగే విమాన గోపురం త్రీడి చిత్రాల నిర్మాణం కోసం రూ. 19.39 లక్షలు ఖర్చు అవుతున్నట్లు అంచనా వేశారు. టీటీడీ దేవాలయాలకు అవసరమైన బంగారాన్ని టీటీడీ తన ఖజానా నుంచి వినియోగించే వెసులుబాటు ఉంది. ఈక్రమంలో టీటీడీ వద్ద ఉన్న బంగారానే్న వినియోగించనున్నట్లు సమాచారం. ఏదేమైనా భూ వరాహస్వామి ఆలయం ఇక స్వర్ణకాంతులను వెదజల్లుతూ భక్తులను మరింతగా ఆకర్షించనుంది.