రాష్ట్రీయం

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 23: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి పట్టపుదేవేరి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజులపాటు కన్నుల పండువగా జరిగే బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం 8.50 గంటలకు వృశ్చిక లగ్నంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం జరిగింది. కంకణభట్టర్ వేంపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈకార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించిన సమయంలోనే యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. అనంతరం రక్షాబంధనం తదితర పూజలు చేసి గజపటాన్ని ధ్వజారోహణం మంటపానికి తీసుకువచ్చారు.
సకల దేవతలకు ఆహ్వానం
ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం నిర్వహించి తొమ్మిది కలశాల్లో ఉంచి ఆయా దేవతలను ఆవాహన చేసి షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజ స్తంభానికి అభిషేకానంతరం బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు. రాగ స్వర తాళాలతో దేవలను, పంచాయుధాలను, సకల గణాలను ఆహ్వానించారు. మూడులోకాల్లోని సకల దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో ధ్వజారోహణ పర్వం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, విఎస్వో ప్రభాకర్, ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాప్, ఏఈఓ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ గోపాలకృష్ణా రెడ్డి, ఆర్జితం ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో శనివారం ఉదయం వేద ఘోష నడుమ ధ్వజారోహణం జరుపుతున్న వేద పండితులు