రాష్ట్రీయం

టీఎస్‌ఆర్టీసీలో వీఆర్‌ఎస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: ఆర్టీసీ కార్మికుల్లో కొంత మందికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, స్వచ్ఛంధ పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) అమలుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రిటైర్మెంట్‌కు ఇంకా 2 నుంచి 5 సంవత్సరాలు ఉన్న కార్మికులను వీఆర్‌ఎస్‌తో సాగనంపడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇదే జరిగితే కనీసం 10 వేల మంది కార్మికులు సర్వీస్ నుంచి వైదొలగాల్సి వస్తుంది. కాగా, కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడానికి ప్రభుత్వం కొన్నిరోజులు వేచిచూసే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తున్నది. బస్‌రూట్లను ప్రైవేటీకరణ చేసుకోవచ్చునని రాష్ట్ర హైకోర్టు సూచించడంతో, వీఆర్‌ఎస్‌పై ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై పూర్తిస్థాయిలో తన సమయాన్ని వెచ్చిస్తున్నారని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 5,100 బస్‌రూట్లను ప్రైవేటీకరణకు రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల
సమస్యలపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్మికులను యథాతథంగా చేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కనీసం 10 వేల మంది కార్మికులను స్వచ్ఛంధ పదవీవిరమణ పథకంతో బయటకి పంపడానికి ప్రభుత్వం తర్జనభర్జన చేస్తోంది. పదవీ విరమణకు ముందు కనీసం 2 లేదా 5 సంవత్సరాల సర్వీస్ ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం తీసుకువస్తోంది. వీఆర్‌ఎస్ అమలు చేస్తే ప్రభుత్వంపై ఏమేరకు ఆర్థిక భారం పడుతుందన్న చర్చ ప్రభుత్వంలో ఊపందుకుంది. పదవీ విరమణను అమలు చేస్తే కనీసం ఐదు, ఆరువేల కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడుతుందని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణతో కార్మికుల సంఖ్యను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా తాత్కాలిక సిబ్బందితో బస్‌లను నడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్న కార్మికులను సంస్థలో కొనసాగించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అయితే, తాత్కాలిక సిబ్బందిని పర్మినెంట్ చేస్తారా? లేక ఔట్‌సోర్సింగ్ విధానంతో కొనసాగిస్తారా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేదు. అయితే, కార్మికులను విధుల్లో చేర్చుకోవడానికి ఎలాంటి గడువును ప్రభుత్వం సూచించడం లేదని అధికారులు చేబుతున్నారు. అయితే ప్రభుత్వ స్పష్టమైన విధానాన్ని ప్రకటించే వరకు కార్మికులను విధుల్లోకి చేర్చుకునే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల పేరుతో వీఆర్‌ఎస్‌ను ప్రకటించి, వారి కుటుంబాలకు ఇస్తుందా? లేక కొంత డబ్బును వన్‌టైమ్‌గా ఇస్తుందా? అన్నది ప్రభుత్వంలో చర్చకు రాలేదని తెలిసింది. సమ్మె కాలంలో కార్మికులకు వేతనాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా? అనే అంశంపైన కూడా స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇలావుంటే, ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేస్తే, కార్మికులు ఏ మేరకు సహకరిస్తారన్నది వేచి చూడాలి. ఏదిఏమైనా, విధుల్లో చేరడానికి ఆర్టీసీ కార్మికులు మరికొంత సమయం వేచి చూడక తప్పదు.