రాష్ట్రీయం

సత్యసాయి స్ఫూర్తితో సమాజ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: సమాజానికి ఎనలేని సేవ చేసిన శ్రీ సత్యసాయి బాబా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సామాజిక సేవ చేయాలని సత్యసాయి విద్యా సంస్థల విద్యార్థులు, భక్తులకు కేంద్ర మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ హాలులో శనివారం నిర్వహించిన శ్రీ సత్యసాయిబాబా 94వ జయంతి వేడుకల్లో కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సత్యసాయి జయంత్యోత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమన్నారు. ప్రజలకు విలువలతో కూడిన విద్య, మంచి వైద్యం అందించిన గాడ్‌మ్యాన్ సత్యసాయి బాబా అని కొనియాడారు. ఆయన ఆశయాలను, సేవా కార్యక్రమాలను సెంట్రల్ ట్రస్ట్ నిరంతరం కొనసాగిస్తుండటం ప్రశంసనీయమని కితాబిచ్చారు. పుట్టిన ప్రతి వ్యక్తీ కచ్చితంగా మరణించాల్సిందేనని, అయితే మరణించే ముందు వాళ్లు ఎంత మేరకు సద్భావనల ద్వారా ప్రేరణ పొందారు, ఎంతగా ప్రజలను చైతన్య పర్చి ప్రోత్సహించి సామాజిక సేవ చేశారన్నదే ప్రధానాంశమవుతుందన్నారు. ‘్భగవాన్ సత్యసాయి బాబా ఎందరినో చైతన్యపర్చారు.. వాళ్ల జీవితాల్లో ముందడుగు వేసే మార్గం చూపారు, విలువలతో కూడిన విద్య ద్వారా జీవితంలో ప్రశాంతంగా, చైతన్యవంతంగా ఎలా జీవించాలో, భవిష్యత్తులో ఉత్తమ గతులను ఎలా పొందాలో నేర్పారు’ అని మంత్రి కొనియాడారు. ప్రతి మనిషి సమాజానికి సేవ చేస్తుండాలన్నది స్వామివారి ఆకాంక్ష అని, ఆ మహనీయుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. సత్యసాయి బాబా విద్యా విధానాన్ని కొనియాడుతూ రానున్న అనేక తరాలకు సత్యసాయి బాబా ఎంతో సహాయ పడ్డారని, విద్య ద్వారా ఉన్నత మేధోసంపత్తి కలిగిన వ్యక్తులు తయారవుతున్నారని శ్లాఘించారు. విలువలతో కూడిన విద్యా విధానం ఎంతో ముఖ్యమని, జ్ఞాన సముపార్జనతో పాటు సామాజిక సేవ కూడా ప్రధానమని అన్నారు. తాను సత్యసాయి బాబా అంటే అచంచలమైన భక్తి భావం కలిగి ఉన్న వ్యక్తినని చెబుతూ, 2011లో తాను, తన కుటుంబం పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యామని, కానీ ఏదో మానవాతీత శక్తి వల్ల తామందరం మృత్యువు నుంచి బయటపడ్డామని గుర్తు చేసుకున్నారు. సత్యసాయి బాబా చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై తాను కూడా వాటిలో పాలుకుంటూ, 9000 హృద్రోగ శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడులు వంటి మంచి పనులు చేయడమే తాము బతికి బయట పడటానికి కారణమని అన్నారు. కనుక మనం చేసే కర్మలను బట్టే ఈ జీవితంలో ఫలితం కూడా ఉంటుందన్నారు. తనకు సమాజ సేవ చేసే అవకాశాన్ని సత్యసాయిబాబా కల్పించారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తనకు మానసిక బలాన్ని ప్రసాదించాలని స్వామిని ప్రార్థిస్తున్నానన్నారు. అంతకుముందు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఎస్‌ఎస్.నాగానంద్ సమర్పించిన ట్రస్ట్ వార్షిక నివేదికను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగానంద్ మాట్లాడుతూ ట్రస్ట్ వార్షికాదాయం రూ.215 కోట్లు అని, అందులో కేవలం రూ.కోటి మాత్రమే పరిపాలనా వ్యయం అవుతోందని అన్నారు. అనంతరం మంత్రి గడ్కరీ సత్యసాయి ఆర్గనైజేషన్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌ఏటీవైఏఎస్‌ఏఐ.ఓఆర్‌జీ) వెబ్‌సైట్‌ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్, తదితరులతో కలిసి ప్రారంభించారు.
తొలుత 10 గంటలకు సాయి కుల్వంత్ హాలుకు విచ్చేసిన కేంద్ర మంత్రి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీ్ధర్‌రెడ్డి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, ఎస్పీ బూసారపు సత్య ఏసుబాబు, కేంద్ర నెహ్రూ యవకేంద్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... పుట్టపర్తిలో సత్యసాయి బాబా సమాధి వద్ద నివాళులర్పిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ