రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం సీజే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 24: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం తన కుమారుడు శ్రీనివాస బాబ్డేతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి కూడా ఉన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రధాన న్యాయమూర్తికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవోలు వారికి శ్రీవారి చిత్రపటం, తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా
ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి ఆశీర్వాదం పొందండం నిజంగా గొప్ప అనుభవమన్నారు. శ్రీవారి ఆలయం, పరిసరాలు, శిల్ప సౌందర్యం కొత్త అనుభూతిని ఇస్తాయన్నారు. టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయం నిర్వహణ తీరు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గజారావ్ భూపాల్, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాధ్, వీజీవో మనోహర్, పేష్కార్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
పద్మావతీదేవిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి జేఈవో పి బసంత్‌కుమార్, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో ప్రభాకర్, ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ గోపాలకృష్ణారెడ్డి, ఏవీఎస్‌వో నందీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే