రాష్ట్రీయం

పెద్దశేష వాహనంపై పద్మావతీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 24 : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం వైకుంఠనాథ స్వామి అలంకారంలో అమ్మవారు ఏడు తలల పెద్దశేష వాహనంపై శంకు, చక్రాలు, గదను చేతబూని భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా పెద్దశేషుడు సేవలందిస్తారు. అభయ వరదహస్తమైన శ్రీవారి పట్టమహిషి అలిమేలుమంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేశారు. సర్పరాజైన శేషుని వాహన సేవలను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. వాహనం ముందుభాగాన అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందుకు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారు నాలుగు మాడవీధుల్లో భక్తులకు అభయప్రదానం చేశారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. వాహన సేవలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో ప్రభాకర్, ఆలయ
డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ గోపాలకృష్ణారెడ్డి, ఏవీఎస్‌వో నందీశ్వర్ రావు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ కోలా శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వేడుకగా స్నపన తిరుమంజనం
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీ కృష్ణ స్వామివారి ఆలయం, శ్రీ సుందర వరదరాజ స్వామి ఆలయం, వాహనమండపం, ఆస్థాన మండపంలో టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.

*చిత్రం... ఆదివారం రాత్రి సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు