రాష్ట్రీయం

ఆదివాసీల పాలిట భూతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, మనుగడను జలసమాధిచేసే పోలవరం ప్రాజెక్టు కాదని, అదొక భూతమని పలువురు ఆదివాసీ ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. అఖిల భారత ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా చింతూరులో ఆదివారం ముంపు రాష్ట్రాల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు(బీజేపీ), ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే సోదెం వీరయ్య, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జడ్పీ ఛైర్మన్ కొవ్వాసి హరీష్, ఒడిస్సా మాజీ ఎమ్మెల్యే మడకం మనోజ్, మానె రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. సదస్సులో ఎంపీ బాపూరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో ఆదివాసీలు మునిగిపోతారని తెలిసినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టనట్టు వ్యవహరించి, ముంపు మండలాలను ఆంధ్రాలో విలీనం చేశారని విమర్శించారు.
ఈ ప్రాజెక్టు వలన ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు లక్షల మంది ఆదివాసీలు, లక్ష మంది గిరిజనేతరులు జలసమాధి కానున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఎంపీ బాపూరావు తెలిపారు. ఈ సభలో ఆదివాసీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని, పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ భూములకు పట్టా భూములు మంజూరుచేయాలని డిమాండుచేస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్టు వలన సర్వం కోల్పోతున్న ఆదివాసీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య మాట్లాడుతూ ఆదివాసీలంతా ఏకతాటిపైకి వచ్చి పోలవరం ప్రాజెక్టుపై తిరుగుబాటుచేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించకుండా, పీసా చట్టం అమలుచేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాయని దుయ్యబట్టారు. సమావేశంలో ఆదివాసీ నాయకులు కురసం సుబ్బారావు, మడివి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...పోలవరం ముంపు రాష్ట్రాల సదస్సులో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ బాపూరావు