తెలంగాణ

రైల్వేలో ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారతీయ రైల్వేలో ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను దశలవారీగా అమలు చేయనున్నట్లు రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో ఆదివారం ఐఆర్‌ఐఎస్‌ఈటీ 62వ వార్షికోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభికులను నుద్దేశించి మాట్లాడుతూ రైల్వేలో ఆధునిక సాంకేతికను తీసుకురావడానికి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 68 వేల కిలోమీటర్లలో రైల్వే మార్గాలు ఉన్నాయన్నారు. తొలుత 650 రైల్వే రూట్లలో ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అమలు చేస్తమన్నారు. కొత్త విధానంలో దక్షిణ మధ్య రైల్వేకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కొత్త విధానంలో సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఆధునీకరిస్తామన్నారు. భవిష్యత్‌లో రైళ్ల వేగానికి తగ్గట్టుగా సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను త్వరలో రైల్వేలో అమలు చేస్తామన్నారు.
రైల్వేలో అమలు జరుగుతున్న ఆధునిక వ్యవస్థతో ఆర్థికంగా బలోపేతం జరుగుతోందన్నారు. సమావేశం ముందు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ అతిథులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్ అధికారులతో పాటు సాంకేతిక నిపుణులు, సిబ్బంది పాల్గొన్నారు.
*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్