రాష్ట్రీయం

మోహినీ అలంకారంలో అలమేలు మంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు శ్రీ అలమేలుమంగ మోహినీ అవతారంలో దర్శనమిస్తే, రాత్రి 7.30 నుంచి 11 గంటల వరకు గజవాహనంపై సిరుల తల్లి విహరిస్తూ భక్తులను అనుగ్రహించింది. వాహనాల ముందు భాగాన అశ్వాలు, వృషభాలు, గజరాజులు ఠీవిగా ముందుకు కదులుతుంటే, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారు విశేషాలంకార భూషితురాలై మాడ వీధుల్లో ఊరేగారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు పట్టి పద్మావతీ దేవిని సేవించుకున్నారు. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన పల్లకిపై వివిధ రకాల ఆభరణాలతో అలంకరించిన అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయతీతశుద్ధ సత్త్వస్వరూపా సాక్షాత్కారాన్ని ఏక సమయంలో సిద్ధింపజేస్తోంది. అన్ని జన్మల్లోకి ఉత్తమమైన మానవ జన్మలో
ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేక, పరమాత్మను చేరుకోలేక అల్లాడుతున్న మానవులు తనను ఆశ్రయిస్తే మాయ తొలగి మరుజన్మలేని శాశ్వత జ్ఞానాన్ని అందిస్తానని తెలియజేయడమే ఈ వాహన సేవ ప్రత్యేకమని పండితులు తెలిపారు. వాహన సేవ అనంతరం మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పద్మావతీ దేవికి వసంతోత్సవం వేడుకగా నిర్వహించారు. రాత్రి 8గంటలకు శ్రీపద్మావతీ అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

*చిత్రం...మోహినీ అలంకారంలో అలమేలు మంగ