రాష్ట్రీయం

వస్తు రూపేణా విరాళాలిచ్చే దాతల కోసం ప్రత్యేక అప్లికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 28: టీటీడీ పరిధిలోని ఆలయాలకు, ఇతర సంస్థలకు వస్తువుల రూపంలో విరాళాలందించే దాతల సౌకర్యార్థం కైండ్ డొనేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పేరిట ప్రత్యేక అప్లికేషన్ రూపొందించాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఐటీ అధికారులను ఆదేశించారు. స్థానిక టీటీడీ పరిపాలనాభవనంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం, చక్కెర, బెల్లం తదితర వంట సరుకులతోపాటుగా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులను విరాళంగా అందించే దాతల వివరాలను ఇప్పటి వరకు రిజిస్టర్లలోనే నమోదు చేస్తున్నారని తెలిపారు.
ఇకపై కంప్యూటర్ అప్లికేషన్ రూపొందించి దాతలకు తగిన ప్రయోజనాలను వర్తింపు చేయాలన్నారు. తక్కువ మొత్తం ఉన్న బిల్లులను కూడా ఈ- ఆఫీస్ ద్వారా పంపి కాగితం వాడకాన్ని తగ్గించాలన్నారు. వివిధ విభాగాల అధికారులకు ఉపయుక్తంగా ఉండేలా టీటీడీ వెబ్‌సైట్‌లో డ్యాష్ బోర్డును రూపొందించాలని ఆదేశించారు. శ్రీవారి సేవకులకు లాకర్ల కేటాయింపు, విభాగాల వారీగా సేవ కేటాయింపు కోసం నూతనంగా రూపొందిస్తున్న అప్లికేషన్‌పై సమీక్షించారు. గోవింద మొబైల్ యాప్‌ను ఒక నెలలోపు మరింత మెరుగ్గా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. అలాగే ఆన్‌లైన్ అడ్మిషన్, డిజిటల్ పిఆర్ మేనేజ్‌మెంట్, లీజ్, రెంటల్ మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ ఎస్టిమేట్స్ , వెహికల్, గూడ్స్ పర్మిట్, విజిలెన్స్ కంప్లైంట్- ట్రాకింగ్, కోర్టు కేసులు, హెచ్ ఆర్ మ్యాప్స్, ఈ-పేమెంట్ తదితర అప్లికేషన్స్‌పై ఈఓ సమీక్షించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈఓ ఏ.వి.్ధర్మారెడ్డి, జేఈఓ పి.బసంత్ కుమార్, ఎఫ్‌ఏసీఏఓ బాలాజీ, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.