రాష్ట్రీయం

కాళీయమర్దనుడి అలంకారంలో సిరులతల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన గురువారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయ మర్దన శ్రీకృష్ణుని అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క్భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు.
స్వర్ణరథంపై మెరిసిన శ్రీమహాలక్ష్మి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 నుండి 5గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అనంతరం రాత్రి 7.30 నుండి 11.30గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారి గరుడసేవ వైభవంగా జరిగింది. గరుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు సన్నుతిస్తున్నారు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకాపలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజ సుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించే గరుడవాహనసేవలో అలమేలు మంగమ్మను దర్శించి సేవించిన వారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుంది. ఈ వాహనసేవల్లో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అదనపు సివిఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, విఎస్‌ఓ ప్రభాకర్, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆగమ సలహాదారు కాండూరి శ్రీనివాసాచార్యులు, ఏఈవో సుబ్రహ్మణ్యం, ఏవిఎస్‌ఓ నందీశ్వర్‌రావు, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
*చిత్రాలు.. స్వర్ణరథంపై విహరిస్తున్న సిరుల తల్లి
*స్వర్వభూపాల వాహనంపై తిరుచానూరు మాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీ పద్మావతీ అమ్మవారు. వర్షం పడడంతో అమ్మవారు తడవకుండా పటాటోపం పట్టిన దృశ్యం (ఇన్‌సెట్‌లో )