రాష్ట్రీయం

వైభవంగా శ్రీపద్మావతి అమ్మవారి రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన శనివారం ఉదయం రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉదయం 7.55 గంటలకు వృశ్చికలగ్నంలో రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడవీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకల దేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధుల్లో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి. శరీరంరథః, ఆత్మరథికుడు, బుద్దిసారది, మనస్సుపగ్గాలు, ఇంద్రియాలుగుర్రాలు, ఇంద్రియ విషయాలు రథం నడిచే తోవలు. రథం రథికుడ్ని చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ దారుల వెంబడి పరుగులు తీరించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మ విషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాల్లో తాత్త్విక బీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12.30 నుండి 2గంటల వరకు రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.
*చిత్రం...తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన శనివారం వేడుకగా రథోత్సవం జరుగుతున్న దృశ్యం