రాష్ట్రీయం

శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టీటీడీ సోమవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్థాన మండపం నుంచి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకువచ్చారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణ ముఖమండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వైదికుల వేదాపారాయణం నడుమ 14 రకాల పువ్వులైన చామంతి, వృక్షి, సంపంగి, గనే్నరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, పగడపు పువ్వులు, ఆరు రకాల పత్రాలైన మరువం, దమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లో, నిత్య కైంకర్యాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగివుంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పుష్పయాగానికి దాదాపు 4 టన్నుల కుసుమాలను వినియోగించారు. టీటీడీ ఉద్యానవన శాఖకు తమిళనాడు నుంచి రెండు టన్నులు, కర్ణాటక నుంచి ఒక టన్ను, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒక టన్ను పువ్వులను దాతలు అందించారు. కాగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యుడు డి.పి.అనంత్, ఆలయ డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏఈఓ సుబ్రమణ్యం, గార్డెన్ మేనేజర్ జనార్థన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీపద్మావతీఅమ్మవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం నిర్వహిస్తున్న అర్చకస్వాములు