రాష్ట్రీయం

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నూతన సంవత్సరం ఆరంభంకు ముందుగానే ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులలో ఆనందం వెల్లివిరియబోతున్నది. 2013 వేతన సవరణ బకాయిల్లో గతంలో జేఏసీతో చేసుకున్న ఒప్పందం మేరకు 40 శాతం అరియర్స్ దాదాపు రూ. 210 కోట్లను ఈ నెల 12వ తేదీ చెల్లించేలా సంస్థ ఎండీ మొవ్వ తిరుమల కృష్ణబాబు మంగళవారం తమ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమతో కుదిరిన ఒప్పందం మేర గత నాలుగేళ్లలో పెండింగ్‌లో ఉన్న యూనిఫారాలకు చెల్లిస్తున్న నగదు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన సమైక్యాంధ్ర సమ్మె కాలపు స్పెషల్ క్యాజువల్ లీవుల నగదు కూడా ఈ నెల 20వ తేదీ లోగా చెల్లిస్తామని కృష్ణబాబు తమకు హామీనిచ్చారని గుర్తింపు సంఘ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు.