రాష్ట్రీయం

దేశ భద్రతలో రాజీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: దేశ భద్రతలో రాజీలేదని, అభివృద్ధికి విఘాతం కల్పించే తీవ్రవాద శక్తుల నుంచి వౌలిక సదుపాయాల వ్యవస్ధను పరిరక్షిస్తామని కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల సంస్ధ (సిఐఎస్‌ఎఫ్) అదనపు డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ ప్రకటించారు. దేశ విద్రోహ శక్తుల పీచమణుస్తామని, అంతర్గత భద్రతకు కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు పునరంకితమై పనిచేస్తున్నాయన్నారు. జాతీయ పారిశ్రామిక భద్రతా బలగాల సంస్ధ (ఎన్‌ఐఎస్‌ఏ) రజతోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడ జరిగిన పాసింగౌట్ పరేడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక భద్రతా బలగాలు క్రమశిక్షణకు మారుపేరన్నారు. దేశంలోని అన్ని వౌలిక సదుపాయాల సంస్థల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్నాయన్నారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
సిఐఎస్‌ఎఫ్‌లో చేరేందుకు యువకులు ఉత్సాహం కనపరుస్తున్నారని, జాతి భద్రతకు సేవలు అందించేందుకు విశిష్టమైన సంస్థగా సిఐఎస్‌ఎఫ్ అవతరించిందన్నారు. ఇక్కడ శిక్షణ కార్యక్రమంలో టెక్నాలజీని సమ్మిళతం చేసి బోధించడం వల్ల పోలీసు బలగాలు విధి నిర్వహణలో ఆటంకవాదులను చురుకుగా, సత్వరమే ఎదుర్కొనేందుకు తోడ్పడుతోందన్నారు. నీసా రజతోత్సవ కార్యక్రమాల సందర్భంగా ప్రతి పోలీసు అధికారి దీక్ష బూని దేశ సంరక్షణకు పనిచేయాలన్నారు. ప్రజలు సిఐఎస్‌ఎఫ్ సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారన్నారు. సిఐఎస్‌ఎఫ్ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పూర్వ పోలీసు అధికారులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ‘నీసా’ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ నీసాలో శిక్షణ కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ పోలీసు అధికారులైన సిఐఎస్‌ఎఫ్ మాజీ డిజి, పద్మభూషణ్ ఎస్ ఆనందం, ఏపి మాజీ డిజిపి ఎంఏ భాసిత్, గుజరాత్ మాజీ డిజిపి కె నిత్యానందం, సిఐఎస్‌ఎఫ్ మాజీ సీనియర్ కమాండెంట్ ఎస్‌ఆర్ నాథ్, సిఐఎస్‌ఎఫ్ మాజీ కమాండెంట్ జెసి దాహియా, మాజీ ఇన్‌స్పెక్టర్ కెఎన్ సోమన్, హెడ్ కానిస్టేబుల్ ఎస్‌ఎస్ సూరిని సత్కరించారు. నీసా డిఐజి టి విక్రమ్ నీసా చేపట్టిన కార్యక్రమాలు వివరించారు.

ఎన్‌ఐఎస్‌ఏ రజతోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న సిఐఎస్‌ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్