రాష్ట్రీయం

గౌతమి ఎక్స్‌ప్రెస్ బోగీకి సాంకేతిక లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, డిసెంబర్ 10: లింగంపల్లి నుండి కాకినాడకు వెళుతున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఏసీ డీ-3 బోగీకి సాంకేతిక లోపం ఏర్పడటంతో మంగళవారం తెళ్లవారుజామున మహబూ బాబాద్ జిల్లా కేసముద్రంలో సుమారు నాలుగు గంటల పాటు నిలిచిపోయింది.
రైల్వే వర్గాల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. లింగంపల్లి నుండి సోమవారం రాత్రి బయలుదేరిన గౌతమి ఎక్స్‌ప్రెస్ నెక్కొండ స్టేషన్‌లో ఆగిన తరువాత తిరిగి బయలుదేరుతున్న సమయంలో బోగీ ఒకటి కొంచెం క్రమం తప్పి ఉన్నట్టు గుర్తించిన డ్రైవర్లు రైలును వేగం తగ్గించి కేసముద్రం వరకు తీసుకువచ్చి అక్కడ నిలిపివేశారు. తరువాత బోగీని పరిశీలించగా, బీ-3 బోగీ వీల్స్ వద్ద ఉన్న స్ప్రింగ్ ఒకటి కొంత బయటకు వచ్చినట్టు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేయగా, డోర్నకల్ నుండి హుటాహుటిన కోచ్ ఇంజనీరింగ్ సిబ్బందిని పంపించారు. వారు బోగీని అన్ని విధాలుగా పరిశీలించిన తరువాత బోగీ రవాణాకు ఉపయోగించే పరిస్థితి లేదని తేల్చారు. దీంతో సాంకేతిక లోపం ఏర్పడ్డ బోగీని రైలు నుండి వేరు చేసి, ఆ బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను మరో రైలులో విజయవాడ వైపు పంపించారు. ఈ కారణంగా అర్ధరాత్రి 1-45కు కేసముద్రం వచ్చిన గౌతమి ఎక్స్‌ప్రెస్ ఉదయం 5-15 గంటలకు కాకినాడకు బయలుదేరింది. కాగా డౌన్ మెయిన్‌లైన్‌లో గౌతమి నిలిచిపోవడంతో కాజీపేట - విజయవాడ వైపు వెళ్లే రైళ్లను లూప్‌లైన్‌లో పంపించడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. లోపాన్ని ముందే పసిగట్టి సమయస్ఫూర్తితో రైలును నిలిపివేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా సాంకేతిక లోపం ఏర్పడ్డ బోగిని సైడింగ్‌లో పెట్టి మంగళవారం సాయంత్రం మరమ్మతులు నిర్వహించారు.
*చిత్రం... సాంకేతిక లోపం ఏర్పడటంతో కేసముద్రంలో నిలిచిన గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మరమ్మతులు నిర్వహిస్తున్న రైల్వే కోచ్ ఇంజనీరింగ్ సిబ్బంది