రాష్ట్రీయం

విద్యాశాఖ ఈ-హాజరు ఉత్తర్వులతో ఉపాధ్యాయుల్లో గందరగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 12: బయోమెట్రిక్ హాజరుపై పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులతో మున్సిపల్ ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ ఫిజికల్ విధానంలో హాజరు నమోదు చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కూడా ఈ-హాజరు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం మున్సిపల్ ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతిరోజూ ఉదయం 11.30 గంటలకు ఈ-హాజరు వివరాలు, ఈ-హాజరు నమోదు శాతం, కారణాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలోని ఐటీ విభాగానికి పంపాలని జిల్లా విద్యాశాఖాధికారులను, నోడల్ అధికారులను ఆదేశించింది. ప్రతి 15రోజులకు ఈ-హాజరు నివేదిక పంపాలని కూడా ఆదేశించింది.