ఆంధ్రప్రదేశ్‌

ఇక దూకుడు పెంచుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు నిరసనగా వైకాపా పోరుబాట
25న పార్టీ పిరాయింపులకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ
మే 2న మండల కేంద్రాల్లో ఖాళీ బిందెల ప్రదర్శన కొవ్వొత్తుల ర్యాలీ
మొదటి వారంలో రాష్టప్రతి, ప్రధాని, ఇసిని కలవనున్న పార్టీ నేతలు
పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, ఏప్రిల్ 19: చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, కరవు, మంచినీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైనందుకు దశల వారీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీ వైకాపా నిర్ణయించింది.
మంగళవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లా కమిటీల అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ వచ్చే నెల 2న మంచినీటి సమస్య తీవ్రతను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు అన్ని మండల కేంద్రాల్లో ఖాళీ బిందెల ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు అనైతిక విధానాలకు పాల్పడుతూ, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కొనుగోలుచేస్తున్నారని, ఈ విధానాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు వీలుగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 25న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. చంద్రబాబు దివాళాకోరు విధానాలను ఢిల్లీలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
మే మొదటి వారంలో రాష్టప్రతి, ప్రధానితో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలవనున్నట్లు ప్రకటించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఢిల్లీకి వెళ్లనున్నట్లు చెప్పారు. సేవ్ డెమాక్రసీ (ప్రజాస్వామ్యాన్ని రక్షించండి) పేరుతో జనంలోకి వెళ్లనున్నట్లు చెప్పారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, విశాఖ రైల్వే జోన్ విషయంలో చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు ఏవగించుకుంటున్నారని జగన్ తీవ్ర స్ధాయిలో విరుచుకు పడ్డారు.
పార్టీని బూత్ స్ధాయి నుంచి పైస్థాయి వరకు పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు, పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జగన్ చెప్పారు.
చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనేందుకు బలమైన ప్రజా పోరాటాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఇక దూకుడుగా వెళ్దామని, హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, ఆ ధైర్యం లేక దొడ్డిదారిన చట్టాలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దాగుడుమూతలు ఆడుతున్నారన్నారు.

లోటస్‌పాండ్‌లో మంగళవారం జరిగిన
పార్టీ సమావేశంలో ప్రసంగిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్

ఏపిపీసెట్, డీసెట్
గడువు పొడిగింపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఏపిపీసెట్-2016కు అపరాధ రుసుం లేకుండా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునే గడువును మే 25వ తేదీ వరకూ పొడిగించినట్టు కన్వీనర్ వై.కిశోర్ చెప్పారు. రూ.500 ఆలస్య రుసుముతో 31 వరకూ, రూ.2 వేల జరిమానాతో జూన్ 5వ తేదీ వరకూ, రూ.5వేల రుసుముతో జూన్ 9వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపిపీసెట్-2016 పరీక్ష జూన్ 11వ తేదీ నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో జరుగుతుంది. అభ్యర్ధులు జూన్ 11న తమ హాల్‌టిక్కెట్లను ‘ఏపిపీసెట్.ఓఆర్‌జి.ఇన్’ అనే వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు.
డీసెట్ గడువు పెంపు
ఇదిలావుంటే, డైట్‌లలో రెండేళ్ల కోర్సులో చేరేందుకు నిర్వహించే డీసెట్-2016 పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించేందుకు గడువును ఈ నెల 27వ తేదీ వరకూ పొడిగించినట్టు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు.
పోర్టులు, ఎయిర్‌పోర్టులకు
మోకాలడ్డిన వైకాపా
ఎమ్మెల్యే బొండా ఆరోపణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులు, ఎయిర్‌పోర్టులు అభివృద్ధి చెందకుండా వైకాపా అడ్డుకుంటోందని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ సాకుతో విపక్షనేత జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని , వైకాపాలో రోజాను భరించలేకనే ఎమ్మెల్యేలు వలస వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలో లేకపోయినప్పటికీ రాష్ట్రానికి మంజూరవుతున్న రైల్వే జోన్‌ను విశాఖకు తీసుకు వెళ్తున్న ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన చెప్పారు.
పంచాయతీ ఖాతాల్లోకే
నేరుగా నిధులు
కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 19: దేశంలోని గ్రామ పంచాయతీల ఆర్థిక సాధికారత కోసం 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదించిన ఫలితంగా పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మంచినీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి సిహెచ్ బీరేంద్రర్‌సింగ్ తెలిపారు. విజయవాడలో ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన చారిత్రక నిర్ణయం వలన దేశంలో గ్రామ పంచాయతీల దిశ మారిపోతుందని చెప్పారు. కేంద్రం 14వ ఆర్థిక సంఘం నిధులు 80 లక్షలు గ్రామ పంచాయతీల ఖాతాలో నేరుగా జమ అవుతాయని, అదే మొత్తం నిధులు నేరుగానుండి విడుదల అవుతాయని, మొత్తం రూ.1కోటి 60 లక్షలు గ్రామ పంచాయతీలకు బదిలీ అవుతాయని ఆయన వివరించారు. ఆ నిధులు సద్వినియోగపర్చుకోడానికి ముందుగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి, వాటిని గ్రామ సభల్లో ఆమోదింప చేయాలని మంత్రి తెలిపారు.

గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికల్లో వౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి బీరేంద్రసింగ్ కోరారు.

తగ్గని ఎండలు
కడపలో 43.28, కర్నూలులో 43.6 డిగ్రీలు
ఆంధ్రభూమి బ్యూరో
కడప/కర్నూలు/అనంతపురం, ఏప్రిల్ 19: రాయలసీమ జిల్లాల్లో సూర్య ప్రతాపం కొనసాగుతోంది. ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గటం లేదు. మరో రెండు, మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలో సగటున 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యధికంగా కర్నూలు నగరంలో 43.6, ఆదోని పట్టణంలో 43.4, నంద్యాలలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 43.28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఎండలు మండిపోతూ వడగాలులు తీవ్రమయ్యాయి. అనంతపురం జిల్లాలో 42.2 డిగ్రీల సెల్సియస్ నమోదైయింది. అనంతపురం నగరంలో 41.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది.
వడదెబ్బకు ముగ్గురు మృతి
కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం జాలవాది గ్రామానికి చెందిన గౌళ్ల రాముడు (55), మండల కేంద్రమైన పత్తికొండకు చెందిన చాకలి నారాయణ (40), కడప జిల్లా చింతకొమ్మదినె్న మండలం బయ్యన్నపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి (60) మంగళవారం వడదెబ్బకు మృతిచెందారు.

దేశ వ్యాప్తంగా
ఉప ఎన్నికల షెడ్యూల్
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు శాసన సభ ఉప ఎన్నికతోపాటు పలు రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి 22న నోటిఫికేషన్ విడుదలవుతోంది. మే 16న ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ 19న. లోక్‌సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా మరణంతో మేఘాలయలోని తుర నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కనుబారి (ఎస్‌టి), జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్, జార్కండ్‌లోని గొడ్డా, పంకి, గుజరాత్‌లోని తలాలా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని జంగీపూర్, బిలారీ, మధ్యప్రదేశ్‌లోని ఘొరదోన్‌గిరి (ఎస్‌టి), తెలంగాణలోని పాలేరుకు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు.