రాష్ట్రీయం

సవాళ్లను సమష్టిగా ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 8: భవిష్యత్‌లో ఎటువంటి సవాళ్లనైనా కలిసే ఎదుర్కొంటామని భారత్, రష్యా నౌకాదళ అధికారులు స్పష్టం చేశారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఇండియా, రష్యా దేశాల సంయుక్త విన్యాసాలు విశాఖ తీరంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యుద్ధ నౌక సహ్యాద్రిపై మంగళవారం భారత్, రష్యా నేవీ అధికారులు సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఇండియన్ నేవీ నుంచి రియర్ అడ్మిరల్ ఎస్‌పి బోక్రే, రష్యా నుండి పసిఫిక్ ఫ్లీట్ డిప్యూటీ కమాండర్ వైస్ అడ్మిరల్ రిబుకిన్ ఆండ్రే ఈ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 2003 నుంచి ఇరు దేశాల మధ్య సంయుక్త విన్యాసాలు ఇంద్ర నేవీ పేరుతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
భారతదేశం రక్షణ రంగంలో చాలా కాలంగా రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోందని బోక్రే చెప్పారు. భారత రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నామని, అయినప్పటికీ సాంకేతికత విషయంలో రష్యా సూచనలు, సలహాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ రష్యా నుంచి యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లను దిగుమతి చేసుకున్నాం.. ఇప్పుడు అమెరికా తదితర దేశాల నుంచి యుద్ధ విమానాలు దిగుమతి చేసుకుంటున్నాం.. దీనివలన రష్యాకు ప్రాధాన్యత తగ్గుతుందా.. అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు బోక్రే సమాధానం చెపుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆయుధ సంపత్తిని ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సేకరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
అయినప్పటికీ రష్యా, భారత్‌లమధ్య సేహ సంబంధాలు, సహకారాలు శాశ్వతంగా కొనసాగుతాయని వివరించారు. వైస్ అడ్మిరల్ ఆండ్రే మాట్లాడుతూ తనకు భారత నౌకాదళ అధికారులతో చాలాకాలంగా పరిచయాలు ఉన్నాయని అన్నారు. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌక, సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ చక్ర నిర్మాణంలో తన పాత్ర ఉందని, అలాగే ఈ సబ్‌మెరైన్‌లోని సెయిలర్స్‌కు తనే శిక్షణ ఇచ్చానని చెప్పారు. ఈ విన్యాసాల్లో భారత నౌకాదళం తరుపున యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఫ్లీట్ ట్యాంకర్ (యుద్ధ నౌక) ఐఎన్‌ఎస్ శక్తి, 877 ఈకెఎన్ సబ్‌మెరైన్, పి8ఐ యుద్ధ విమానం, డార్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్స్, జెట్ ట్రైనర్స్ పాల్గొంటున్నాయి. అలాగే రష్యా దేశం నుంచి వర్యాగ్ (క్రూయిజర్), బైస్ట్రీ (డిస్ట్రాయర్) ఆల్టగ్ (రెస్క్యూ ఓషన్ గోయింగ్ టగ్), బోరిస్ బుటోమా (్ఫ్లట్ ట్యాంకర్) ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాలు ఈనెల 15 వరకూ జరగనున్నాయి.

విలేఖరుల సమావేశానికి
ముందు కరచాలనం చేసుకుంటున్న
భారత -రష్యా నేవీ
అధికారులు బోక్రే , ఆండ్రే