రాష్ట్రీయం

నీటి విడుదలపై ఆదేశాలు అందలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, డిసెంబర్ 8: సీలేరు నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదలపై ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని ఎపి జెన్‌కో చీఫ్ ఇంజనీర్ కుమార్ బాబు తెలిపారు. మంగళవారం సీలేరు పవర్‌ప్లాంట్ కాంప్లెక్స్‌లో పర్యటించారు. సీలేరులో విద్యుత్ ఉత్పత్తి అనంతరం నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీలేరు కాంప్లెక్స్‌లో ప్రస్తుతం 45 టిఎంసిల నీటి నిల్వలున్నాయన్నారు. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి అనంతరం గోదావరి డెల్టాకు డొంకరాయి కెనాల్ నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీలేరు కాంప్లెక్స్‌లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్‌లో ఉన్న జల విద్యుత్‌కేంద్రాలన్నీ విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

బాక్సైట్ తవ్వకాలు అడ్డుకుంటాం: వైకాపా
చింతపల్లి, డిసెంబర్ 8: ఆదివాసీల బతుకులకు ఛిద్రం చేసే బాక్సైట్ తవ్వకాలను అడ్డుకునే శక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఈనెల 10న విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో జగన్ పాల్గొనే బాక్సైట్ వ్యతిరేక సభా స్థలాన్ని వైకాపా నేతలు మంగళవారం పరిశీలించారు. అనంతరం స్థానిక కాఫీ అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడుతూ బాక్సైట్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన శే్వతపత్రంలో ఒక్క వాస్తవం కూడా లేదన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో బాక్సైట్ ఒప్పందాలు జరిగాయనే ఆరోపణలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారన్నారు. వాస్తవానికి తెలుగుదేశం హయాంలోనే ఈ ఒప్పందాలు తెరపైకి తెచ్చారన్నారు. 4,500 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ముడి ఖనిజం విలువ లక్షల కోట్ల రూపాయల్లో ఉండడంతో ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే తవ్వకాల జీవోను విడుదల చేసి తన నైజం నిరూపించుకున్నారన్నారు. ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గిరిజనులకు పీసా, 1/70, గిరిజన అడ్వయిజరీ కమిటీ వంటి చట్టాలున్నా వాటిని తుంగలోకి తొక్కి చంద్రబాబు తవ్వకాలకు పాల్పడుతున్నారన్నారు. తవ్వకాలను ఆపేందుకే జగన్ ఈనెల 10న చింతపల్లిలో బాక్సైట్ వ్యతిరేక సభను నిర్వహిస్తున్నారన్నారు . గిరిజనుల పక్షాన పోరాడే ఈసభను విజయవంతం చేయాలని వై ఎస్సార్ పార్టీ నేతలు కోరారు.