రాష్ట్రీయం

హైకోర్టు విభజనపై సుప్రీంకెళ్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఏప్రిల్ 21: రాష్ట్ర హైకోర్టు విభజన అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటున్నట్లు టిఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు, సీనియర్ నాయకుడు బి.వినోద్‌కుమార్ తెలిపారు. వినోద్‌కుమార్ గురువారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడను కలిసి హైకోర్టు విభజన, రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లను పెంచటం గురించి చర్చించారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం రెండు సంవత్సరాల్లో రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులను ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ ఆ పని ఇంతవరకు జరగలేదు కాబట్టి ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నట్లు వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించవలసిన అవసరం గురించి సదానందగౌడకు వివరించినట్లు ఆయన విలేఖరులతో చెప్పారు. ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాల శాసన సభల సీట్లసంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన రాష్ట్ర వినజన సవరణ బిల్లును వచ్చేవారం నుండి మళ్లీ ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ప్రతిపాదించాలని గౌడను కోరినట్లు వినోద్‌కుమార్ చెప్పారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.