రాష్ట్రీయం

తెలంగాణ రాష్ట్ర పోలీసుకు ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు ప్రతిష్టాకరమైన ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు లభించింది. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణ విభాగంలో ఢిల్లీలోని ఫిక్కీ ఈ అవార్డును తెలంగాణ పోలీసు శాఖకు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను డిజిపి కార్యాలయం గురువారం వెల్లడించింది. తెలంగాణ పోలీసు శాఖ ప్రవేశపెట్టిన బాడీ వార్న్ కెమెరాతో పాటుగా ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో నగదు రహిత చలాన్ విధానాన్ని ప్రవేశపెట్టినందుకు గాను ఈ అవార్డును ఇస్తున్నట్లు ఫిక్కీ తెలిపిందని డిజిపి అనురాగ్‌శర్మ వెల్లడించారు. దేశంలో ఉన్న 19 రాష్ట్రాల పోలీసులు, 3 కేంద్ర రిజర్వు పోలీసు విభాగాలు, వివిధ కేటగిరిలకు సంబంధించి 91 ఎంట్రీలు అందగా, వాటి నుంచి ఢిల్లీలోని ఫిక్కీ న్యాయనిర్ణేతల జ్యూరీ తెలంగాణ పోలీసు శాఖను ఎంపిక చేసింది. బాడీవార్న్ కెమెరాతో నేరస్థులను రుజువులతో సహా పట్టించేందుకు వీలవుతుందని, అలాగే ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపే వారిని పట్టుకుని పెనాల్టీని నగదు రూపంలో వసూలు చేయకుండా చలాన్ రాసివ్వడం వల్ల అవినీతికి చెక్ పెట్టినట్లు చేసే రెండు విధానాలను ప్రజలు ఆదరించారని డిజిపి తెలిపారు. మరే ఇతర రాష్ట్రాల్లో లేని ఈ విధానాల పట్ల న్యాయనిర్ణేతల జ్యూరీ తెలంగాణ పోలీసు శాఖ పనితీరును గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసిందని డిజిపి తెలిపారు. ఈ కొత్త విధానాలను ప్రవేశపెట్టిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డిని అవార్డు గ్రహీతగా పేర్కొంటూ ఫిక్కీ నుంచి తనకు లేఖ అందిందని డిజిపి అనురాగ్‌శర్మ తెలిపారు. అలాగే మెదక్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న బి.సుమతికి కూడా ఫిక్కీ స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించిందని ఆయన తెలిపారు. ‘మన భద్రత-మన పోలీస్-మన బాధ్యత’ అనే నినాదంతో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసిన ఎస్పీని స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు ఆ కరపత్రాల్లో మహిళల భద్రత, బాలల హక్కుల పరిరక్షణ, ఆపదలో ఉంటే పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశాలను పొందుపర్చి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కోసం ప్రచారం చేసిన ఎస్పీని అభినందించారు.