రాష్ట్రీయం

శ్రీశైలం ఓవర్ రివర్ వ్యూ డ్యామ్‌కు భారీ గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, నవంబర్ 20: శ్రీశైలం జలాశయానికి దిగువన ఎడమగట్టు పరిధిలో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఓవర్ రివర్ వ్యూ డ్యామ్‌కు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో రూ.2 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. 2003 నుంచి ఈ టెయిల్ పాండ్ (ఓవర్ రివర్ వ్యూ) డ్యామ్ నిర్మిస్తున్నారు. సుమారు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఎండాకాలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు వీలుగా శ్రీశైలం డ్యామ్‌కు దిగువన 16 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ టెయిల్ పాండ్ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. నది పాయకు అడ్డంగా 2 టిఎంసిల నీటిని నిల్వ చేసుకుని అత్యవసర సమయాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా నిర్మాణం చేస్తున్నారు. ఎడమగట్టులో అధునాతన టెక్నాలజీ రివల్స్‌బుల్ పంపింగ్ ద్వారా విద్యుత్ కేంద్రంలోకి పంపింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి తరువాత నీటిని విడుదల చేస్తారు. తిరిగి అదే నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తారు. గురువారం రాత్రి పెద్దఎత్తున నీటి ప్రవాహం రావడంతో టెయిల్ పాండ్ డ్యామ్ పైకి నీరు ప్రవహించింది. దీంతో నీటి ఉద్ధృతికి డ్యామ్ మధ్యలో సుమారు 20 అడుగుల మేర భారీ గండిపడింది. దీంతో కృష్ణానది వెంట ఉన్న మత్స్యకారులు తమ జీవనభృతికి ఉపయోగించే వలలు, పుట్టీలు, బోట్లు కొట్టుకుపోయి సర్వం కోల్పోయారు. ప్రభుత్వం, జెన్‌కో అధికారులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా డ్యామ్‌కు పడిన గండి గురించి తెలుసుకున్న జెన్‌కో అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. డ్యామ్ అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల అధికారుల నిరంతర పర్యవేక్షణ కొరవడిందని అంటున్నారు. నాసిరకం పనుల వల్లే డ్యామ్‌కు గండి పడిందని భావిస్తున్నారు. నదిలో లభించే ఇసుక, బండరాళ్లను నిర్మాణంలో ఉపయోగించినట్లు తెలుస్తోంది.