రాష్ట్రీయం

శోభాయమానం..అంజనీపుత్రుని యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అంజనీ పుత్రుని శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది. గౌలిగూడ శ్రీరామ మందిరంలో శాంతి హోమంతో ప్రారంభమైన శోభాయాత్ర సికిందరాబాద్ తాడ్‌బంద్ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ శోభాయాత్రలో విహెచ్‌పి జాతీయ, అంతర్జాతీయ నాయకులు పాల్గొన్నారు. భారీ బందోబస్తు మధ్య మొత్తం 8.2 కిలోమీటర్లు సాగిన శ్రీ వీరహనుమాన్ విజయ యాత్ర ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం ఉదయం నగరంలోని గౌలిగూడ శ్రీరామమందిర్‌లో బజరంగ్‌దళ్, విశ్వహిందూపరిషత్ సంయుక్త్ధ్వార్యంలో నిర్వహించిన శాంతి హోమంతో ప్రారంభమైన శోభాయాత్రలో వేలాది మంది భక్తులు ‘జై శ్రీరాం..జై శ్రీరాం’ అంటూ నినదించారు. బైక్ ర్యాలీలు, జై హనుమాన్, జై శ్రీరాం నినాదాలతో నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామ మందిరం నుంచి ప్రారంభమైన శోభాయాత్రలో కోఠి సుల్తాన్ బజార్‌లో భాగ్యనగర్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై హనుమాన్ చాలీసా పఠించారు.
ఈ కార్యక్రమంలో విహెచ్‌పి అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాగ్యనగరవాసులంతా సుఖ,శాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించారు. పనె్నండేళ్ల క్రితం 250 మందితో ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర నేడు రెండున్నర లక్షలకు చేరడం ముదావహమన్నారు. కొన్ని స్వార్థ శక్తులు హైందవ మతాన్ని వక్రీకరించే విధంగా ప్రవర్తిస్తున్నాయని, వారిని తరిమికొట్టేందుకు సంఘటితం కావాలని జైన్ పిలుపునిచ్చారు. కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసి క్రాస్ రోడ్డు, ముషీరాబాద్, రేతిఫైల్ మీదుగా సాగిన శోభాయాత్ర తాడ్‌బంద్ చేరుకుంది. తాడ్‌బంద్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విహెచ్‌పి రాష్ట్ర కన్వీనర్ వై భానుప్రకాష్, గ్రేటర్ అధ్యక్షుడు చంద్రశేఖర్, నగర కార్యదర్శి రాజ్‌గోపాల్ నాయుడు యాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించి ట్రాఫిక్‌ను మళ్లించారు. యాత్ర జరిగిన రహదారిపై 12 ప్లాటూన్ల అదనపు బలగాలను వినియోగించారు. సెంట్రల్ జోన్ పరిధిలో సుమారు 15వందల మంది పోలీసు బలగాలను దించారు. 93 సిసి కెమెరాలతోపాటు 100 వీడియో కెమెరాలు ఏర్పాటు చేశామని, మొత్తంపైన హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసిందని నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. శోభాయాత్రకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన
శోభాయాత్ర లో పాల్గొన్న విహెచ్‌పి నేత సురేంద్రజైన్, బజరంగ్‌దళ్ నాయకులు