రాష్ట్రీయం

అవినీతిపై రణభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, అసెంబ్లీ అంటే ఏ మాత్రం నమ్మకం ఉన్నా టిడిపిలో చేర్చుకున్న 12మంది వైసిపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, ప్రజలు మళ్లీ ఎవరిని ఎన్నుకుంటారో తేల్చుకుందామని ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాలు విసిరారు. శనివారం ఇక్కడ ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి చంద్రబాబు ఎమ్మెల్యేలను నల్లధనంతో కొనుగోలు చేస్తున్నారని, అనైతిక విధానాలను నిలువరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన రాజ్‌భవన్ వెలుపల విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇంతవరకు తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వెళ్లినా తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఇచ్చి కొంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని నడిబజార్లో హత్య చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇవన్నీ చూస్తున్నా స్పీకర్ ఏమీ పట్టించుకోవడం లేదన్నారు.
జీవో 20 జారీ చేసి కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ఇసుక మాఫియా, పట్టిసీమ ప్రాజెక్టు పనులకు 22 శాతం అదనంగా చెల్లించడం ఇవన్నీ అవినీతికి పరాకాష్ట అన్నారు. అవినీతి సొమ్మును ముఖ్యమంత్రి చంద్రబాబు, తనయుడు లోకేష్, మంత్రులు పంచుకుంటున్నారన్నారు. రాజధాని ప్రాంతం ప్రదేశాన్ని తన అనుచరులకు చెప్పి భూములు కొనుగోలు చేయించి ఆ తర్వాత అమరావతి పేరును ఖరారు చేశారన్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తమకు ఈ నెల 25న అపాయింట్‌మెంట్ ఇచ్చారని, చంద్రబాబు రాజకీయ అవినీతి చరిత్రను ఆధారాలతో రాష్టప్రతికి సమర్పించనున్నామని చెప్పారు. రాష్ట్రం వడగాడ్పులు, ఎండలతో సతమతమవుతోందని, ప్రజలు గుక్కెడు నీళ్లు దొరక్క అల్లాడుతున్నారని, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా రాజకీయంగా అనైతిక విధానాలకు పాల్పడుతున్నారన్నారు.

చిత్రం గవర్నర్ నరసింహన్‌కు రాజకీయ పరిస్థితిని వివరిస్తున్న విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి