రాష్ట్రీయం

దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు మీదుగా 184 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక నాలుగు లేన్లతోపాటు సైక్లింగ్ ట్రాక్ ఉండే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం చేయబోతున్నట్టు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ మేరకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేశామని, త్వరలోనే టెండర్లు కూడా పిలుస్తామని చెప్పారు. హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద చేపట్టే అభివృద్ధి పనులను కెటిఆర్ శనివారం పరిశీలించారు. దుర్గం చెరువును సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. చెరువు చుట్టూ సైక్లింగ్ , వాకింగ్ ట్రాక్‌ల సదుపాయాలు కల్పించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం జిహెచ్‌ఎంసి, టిఎస్‌ఐఐసి నిధులు ఖర్చు చేస్తాయని తెలిపారు. సుమారు 20 కోట్ల వ్యయంతో హంపీ థియేటర్ బోటింగ్ లాంటి అంతర్జాతీయ సౌకర్యాల కల్పనకు టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. దుర్గం చెరువు పరిసరాల్లో హెరిటేజ్ రాక్ జోన్‌కు ఎలాంటి ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దుర్గం చెరువులోకి మురికి నీటి మళ్లింపు జరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

చిత్రం దుర్గం చెరువు ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్న మంత్రి కెటిఆర్