ఆంధ్రప్రదేశ్‌

ఈ ఇబ్బందులు తాత్కాలికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం/తడ, ఏప్రిల్ 25: రాష్ట్ర విభజన తరువాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇవి తాత్కాలికమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. శాశ్వతంగా సమస్యలు పరిష్కారం కావాలంటే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం శ్రీసిటీలో తొలి దశలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో 134 ఎకరాల్లో ఏర్పాటుచేసిన క్యాడ్బరీ చాక్లెట్ ఫ్యాక్టరీని సోమవారం సిఎం ప్రారంభించారు. పరిశ్రమలు పెరగాలని, రెండూ వస్తే సర్వేస్ సెక్టార్ వస్తుందన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. బాగా కష్టపడితే ఇక్కడ ఇండస్ట్రియల్ టౌన్ షిప్‌కూడా ఏర్పడుతుందన్నారు. ఇక్కడ స్కిల్ డెవలెప్‌మెంట్ జరగాలని, పరిశ్రమలకు ఎటువంటి స్కిల్స్ కావాలో ట్రైనింగ్ ఇచ్చిన యువతను పరిశ్రమల నిర్వాహకులకు అప్పగిస్తే వారు ఎన్నికచేసుకుంటారన్నారు. శ్రీసిటిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి నివాసాలు కూడా ఇక్కడే ఉండాలన్నారు. ఈ ప్రాంతంలో నీటి సమస్య లేదని , పక్కనే సోమశిల, కండలేరు, తెలుగు గంగ ద్వారా నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. కృష్ణపట్నంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉండటం వలన విద్యుత్ సమస్యలేదని, రోడ్డుమార్గం, రైల్వే కనెక్టింగ్, బోర్డు కనెక్టింగ్ బ్రహ్మాండంగా ఉండటం శ్రీసిటీ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణమన్నారు. ఈరోజు ప్రపంచంలోని అన్ని రంగాల్లో తెలుగువారు ముందుకు వెళ్తున్న విషయాన్ని ఆయన మరోమారు ప్రస్తావించారు. ప్రతి 3 నెలల కోసారి శ్రీసిటీని సందర్శిస్తానని, ఈలోగా 20 నుంచి 30 యూనిట్లు ఏర్పాటుచేయాలని , ఆ విధంగా శ్రీసిటీ యాజమాన్యం కృషిచేయాలన్నారు. పరిశ్రమ వలన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారని అభినందించారు. కొంత మంది ఇబ్బందులు సృష్టించడం ద్వారా పెట్టుబడి దారులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. తద్వారా రాష్ట్రం నష్టపోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి చాలా చేశామని, విద్యుత్‌కోతలు ఎత్తివేశామని, సంవత్సర కాలంలో పట్టిసీమను పూర్తిచేసి రెండు నదులను కలిపిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలని తెలిపారు. పాల ఉత్పత్తిలో చిత్తూరుజిల్లా ముందుందని, నెలకు 13 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోక్యాట్‌బరీ చాక్లెట్ యాజమాన్యం ఈ పాలను ఉపయోగించుకొని జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధిలో దోహదపడాలని కోరారు. ఉభయగోదావరి జిల్లాలో కోకో సాగు బ్రహ్మాండంగా ఉందన్నారు. రానున్న 10 యేళ్లలో లక్ష ఎకరాల్లో కోకో సాగుచేసి చాక్లెట్ కంపెనీకి ఉత్పత్తులు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

చిత్రం శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డితో చర్చిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు