ఆంధ్రప్రదేశ్‌

డిస్కమ్ పరిధిలో 700 సోలార్ పంపుసెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 25 : చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఈ నెలాఖరులోగా సుమారు 700 సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయనున్నట్లు సదరన్ డిస్కమ్ సిఎండి హెచ్‌వై దొర తెలిపారు. సోమవారం శ్రీకాళహస్తి సమీపంలోని తొట్టంబేడు మండలంలో సోలార్ పంపుసెట్లను, బిఎన్ కండ్రిగ మండలం నెలవాయి ఎస్సీ కాలనీలో డిడియుజిజెవై పథకం కింద మంజూరైన గృహ విద్యుత్ సర్వీసులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ పంపుసెట్ల ద్వారా అంతరాయం లేని విద్యుత్ సరఫరాను రైతులు పొందవచ్చని అన్నారు. రాత్రివేళల్లో పొలాలకు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. మే నెల 15వ తేదీ తరువాత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా విద్యుత్ సర్వీసులేని గృహాలను గుర్తిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.