ఆంధ్రప్రదేశ్‌

ఉత్తరాంధ్రలో మళ్లీ నిలిచిన విద్యుత్ సరఫరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 25: ఉత్తరాంధ్రవాసులను విద్యుత్ సమస్య సోమవారం కూడా ఇబ్బందులకు గురిచేసింది. ఆదివారం 12 గంటల పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖ కలపాకలోని 400 కె.వి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కెపాసిటర్ ఓల్టేజి ట్రాన్స్‌ఫార్మర్(సివిటి) పూర్తిగా దెబ్బతినింది. దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు విశాఖ కలపాక పవర్‌గ్రిడ్ సర్క్యూట్ 1, 2కు చెందిన ఇంటర్ కనెక్టటెడ్ ట్రాన్స్‌ఫార్మర్ (ఐసిటి)లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగా పెందుర్తి, గాజువాక, గరివిడి, టెక్కలి ఫీడర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో నాలుగు గంటలకు పైగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 200 మెగావాట్ల నుంచి 250 మెగావాట్ల వరకు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్‌ను (ఇఆర్‌ఎల్) ప్రకటించింది. అయితే పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికను చేపట్టిన పునరుద్ధరణ పనులతో నాలుగు గంటల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలు ప్రాంతాలకు సరఫరా నిలిచిపోయ నాలుగు గంటలపాటు జనానికి ఇబ్బందులు తప్పలేదు. ఆది, సోమవారాల్లో వరుసగా రెండు రోజులపాటు ఒకే సమయంలో నెలకొన్న సాంకేతికలోపాలపై ఏపీ ట్రాన్స్‌కో ప్రత్యేక దృష్టిపెట్టింది. సిబ్బంది సత్వర చర్యలతో నాలుగు గంటల వ్యవధిలో విద్యుత్ సరఫరా మెరుగుపడిందని ఈపిడిసిఎల్ ఆపరేషన్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ పివివి సత్యనారాయణ తెలిపారు.