రాష్ట్రీయం

పరువు తీసేందుకే ఢిల్లీకి జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరువును దెబ్బతీసేందుకే ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అనే క అవినీతి కేసుల్లో ప్రధాన నిందితుడిగా, 12 చార్జిషీట్లలో మొదటి నిందితుడిగా ఉంటూ ప్రతి శుక్రవారం కోర్టు కేసులను ఎదుర్కొనే వ్యక్తి చంద్రబాబు పాలనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ కంటికి అందరూ అవినీతిపరుల్లా కనిపిస్తున్నారని, అసెంబ్లీలో జగన్మోహన్‌రెడ్డి చేసిన అన్ని ఆరోపణలకు తాము జవాబిచ్చామని, రుజవు చేయాలని చాలెంజ్ చేస్తే తోక ముడిచారని అన్నారు. రాజధాని భూములపై వచ్చిన ఆరోపణలపై మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి నారాయణ ఛాలెంజ్ చేస్తే కూడా జగన్ పారిపోయారని యనమల పేర్కొన్నారు. 2002లో కొన్న లింగమనేని భూములపై జగన్ ఆరోపణలు చేస్తున్నారని, అది చూస్తేనే ఆరోపణల్లో ఎంత నిజం ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లో 1800 ఎకరాల అసైన్డ్ భూములను అధికార పార్టీ నేతలు కొన్నట్టు ఆరోపించారని, 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్ భూములు మొత్తం 697 ఎకరాలు మాత్రమేనని, అందులో 344 ఎకరాలు లబ్ధిదారుల వద్దే ఉందని, మిగిలిన 357 ఎకరాలు శివాయిజమా భూములు 2011 కంటే ముందే చేతులు మారాయని, మరి 1800 ఎకరాలు ఎక్కడినుండి వచ్చాయని యనమల నిలదీశారు. రాజధాని ప్రాంతంలో 25వేల ఎకరాలు టిడిపి నేతలు లాక్కున్నట్టు జగన్ ఆరోపించారని, 2014 జూన్ 1 తర్వాత మొత్తం అమ్మకాలు జరిగింది 9వేల ఎకరాలేనని, అలాంటిది 25వేల ఎకరాలు ఎక్కడినుండి వచ్చాయని ప్రశ్నించారు. బాలకృష్ణ వియ్యంకుడికి 300కోట్లు విలువైన 200 ఎకరాల భూమిని కృష్ణా జిల్లా జయతీపురంలో కట్టబెట్టినట్టు ఆరోపించారని, వాస్తవానికి 2010లో అప్పటి కలెక్టర్ దీని ప్రతిపాదనలు పంపిస్తే 2012లో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంఓయు చేసుకుందని, ఆ నిజాలు తెలుసుకోకుండా చంద్రబాబుపై విమర్శలు చేస్తే ఎలా అని నిలదీశారు. ‘ఎంపరర్ ఆఫ్ కరెప్షన్’ పేరుతో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలో పంపిణీ చేస్తున్న పుస్తకాలు సాక్షి పత్రికలో వచ్చిన అవాస్తవిక కథనాలే తప్ప మరొకటి కాదని అన్నారు. విపక్షం పట్టిసీమ ప్రాజెక్టుకు ఆటంకం కల్పించిందని, రైతులను రెచ్చగొట్టాలని చూశారని, నదుల అనుసంథానం కార్యక్రమాన్ని వ్యతిరేకించారని, ఈ ప్రాంతంలో రాజధాని రాకుండా అనేక అడ్డంకులు పెట్టారని ల్యాండ్ పూలింగ్‌కు సైతం అడ్డుపడాలని చూశారని తుదకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం విఫలమైందని, ప్రజల విశ్వాసంతోపాటు సొంత ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కూడా పొందలేకపోయిందని అన్నారు.