రాష్ట్రీయం

ఎయుకు ఎపిసెట్ నిర్వహణ బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (ఎపిసెట్) నిర్వహణకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి యుజిసి అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆచార్య ఇ.ఎ.నారాయణ మీడియా సమావేశంలో ఇక్కడ గురువారం వెల్లడించారు. గత నెలలో యుజిసి నిపుణుల బృందం వర్సిటీని సందర్శించిందని, వివిధ అంశాలను పరిశీలించిందన్నారు. కమిటీ సభ్యులు మూడేళ్ల కాలానికి ఈ సెట్ నిర్వహణకు అనుమతి మంజూరు చేశారన్నారు. వర్సిటీలోని మేథో, వౌలిక వసతులను పరీశీలించాకే నిర్వహణ బాధ్యతలు అప్పగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎపిసెట్ నిర్వహించే బాధ్యతను వర్సిటీకి అప్పగించిందని, త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించి పరీక్షకు అవసరమైన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు. తొలిదశలో 31 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తామని, మరో 20 రోజుల్లో నోటిఫికేషన్ తేదీలు వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలో 6700 అధ్యాపక ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, వర్సిటీ ఆచార్యుల నియామకంలో యుజిసి నెట్, సెట్ పరీక్షల్లో అర్హతను పరిగణనలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు.