రాష్ట్రీయం

చీఫ్ జస్టిస్ ఠాకూర్ కంటతడి కలచివేసింది: ఇంద్రకరణ్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: న్యాయస్థానాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయముర్తి జస్టిస్ టిఏస్ ఠాకూర్ కంటతడి పెట్టడం తనను కలచివేసిందని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయముర్తుల సంయుక్త సమావేశంలో తెలంగాణ తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు భవనాల నిర్మాణానికి, సిబ్బంది పెంపునకు, వౌలిక సాదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం తన వంతు సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఏస్ ఠాకూర్ హైదరాబాద్ వచ్చినపుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనతో సమావేశమై పలు విషయాలు చర్చించారని గుర్తుచేశారు. ప్రజలకు సత్వర న్యాయం లభించడానికి సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందని సిఏం కెసిఆర్ స్పష్టం చేశారన్నారు. కోర్టుల పనిగంటలు పెంచడం, సెలవు దినాల్లో పనిచేసే కోర్టుల (హాలిడే కోర్టు)ను ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదించారని, వీటికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి తెలిపారు.