రాష్ట్రీయం

నియోజకవర్గానికో ఇండస్ట్రియల్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రతి శాసనసభ నియోజకవర్గానికొక ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. గురువారం నాడిక్కడ పిబి సిద్ధార్థ కళాశాలలో టిఎంఐ గ్రూప్‌కు చెందిన భారతదేశ మొట్టమొదటి మొబైల్ ఆధారిత రిక్రూట్‌మెంట్ సొల్యూషన్ జాబ్స్ డైలాగ్‌ను ప్రారంభించి ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగుల ముంగిటకు తీసుకువచ్చి ఉద్యోగ రథంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ రథం ద్వారా నిరుద్యోగులకు ఉచిత సేవలు అందించాలనే లక్ష్యం హర్షణీయమన్నారు. విభజన సమస్యలు అనేకం ఉన్నప్పటికీ అభివృద్ధిలో దూసుకెళ్తున్నామన్నారు. ఫైబర్ గ్రిడ్‌ను రికార్డు సమయంలో అతి తక్కువ వ్యయంతో పూర్తి చేయగల్గుతున్నామన్నారు. ఫైబర్ గ్రిడ్ పూర్తయితే ఊరంతా వైఫై తీసుకువచ్చి చరిత్ర సృష్టిస్తామన్నారు. ఒక్క ఆలోచనతో యువత అద్భుతాలు సాధించవచ్చన్నారు. అసాధ్యమనుకున్న రాజధాని భూసమీకరణను వినూత్నంగా ఆలోచించి సుసాధ్యం చేశామన్నారు. పోలవరం పూర్తయ్యే వరకు ఎదురు చూడకుండా పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేసి నదులను అనుసంధానం చేశామన్నారు. అభివృద్ధికి నిధుల కొరత సమస్య కాదన్నారు. శ్రీసిటీతో వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో వనరులకు కొరత లేదన్నారు. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్లతో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. యువత వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చి రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు బలోపేతం చేయడం, దేశంలో ఉత్తమ విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడం, పిపిపి పద్ధతిలో విద్యా సంస్థలను నెలకొల్పి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. యువత సందేహాలకు సమాధానాలు ఇస్తూ వారి నుంచి కొన్ని సూచనలు సలహాలు స్వీకరించారు. సభలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, టిఎంఐ గ్రూప్ చైర్మన్ టి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు.