రాష్ట్రీయం

రాజకీయ శక్తుల పునరేకీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఒకే పోస్టర్‌లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లు కాంగ్రెస్‌కు ఓటు వేయమని ప్రజలకు పిలుపు ఇస్తే ఎలా ఉంటుంది? చూసేందుకు వింతగా అనిపించినా ఇప్పుడు ఖమ్మం జిల్లా పాలేరులో ఈ పోస్టర్ ఓ సంచలనం. భవిష్యత్తు రాజకీయాలను ప్రతిబింబించే విధంగా ఉన్న ఈ పోస్టర్‌లానే తెలంగాణ రాజకీయాలు మారనున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కని పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఇదే పరిస్థితి. చివరకు గ్రేటర్ హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తప్పదని ఆశించిన విపక్షాలు విస్తుపోయే విధంగా టిఆర్‌ఎస్‌కు 99 డివిజన్లలో విజయం లభించింది. తరువాత ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌ను సైతం కైవసం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో విపక్షాలు ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు చేయడమే కాకుండా ఎన్నికల్లో సైతం కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. శాసన మండలి ఎన్నికల్లో లోపాయికారిగా టిడిపి, కాంగ్రెస్‌కు పలు జిల్లాల్లో మద్దతు ఇచ్చింది. నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేటలో మహాకూటమిగా అన్ని పార్టీలు ఏకమై టిఆర్‌ఎస్‌పై పోటీ చేశాయి. నల్లగొండలో మహాకూటమి కాస్త వర్కవుట్ అయింది, కానీ అచ్చంపేటలో మాత్రం పని చేయలేదు. ఇక్కడ మొత్తం 20 వార్డుల్లోనూ టిఆర్‌ఎస్ విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో వచ్చిన పాలేరు నియోజక వర్గం ఉప ఎన్నికల్లో విపక్షాలు మరోసారి ఏకమయ్యాయి. అధికారికంగానే టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. కిష్టారెడ్డి మృతితో ఉప ఎన్నికలు జరిగితే నారాయణఖేడ్‌లో పోటీ చేసిన టిడిపికి డిపాజిట్ దక్కలేదు. పాలేరులో దీనికి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో తొలుత టిఆర్‌ఎస్, టిడిపి, కాంగ్రెస్‌ల కన్నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ బలంగా ఉండేది. సాధారణ ఎన్నికల్లో జిల్లా నుంచి టిఆర్‌ఎస్ ఒకే ఒక స్థానంలో విజయం సాధిస్తే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రం మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో, ఒక పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంది. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితులు మారాయి. దాంతో పాలేరు నుంచి పోటీ చేయవద్దని టిడిపితో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఒకే పోస్టర్‌పై కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అగ్రనాయకుల ఫోటోలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టిడిపి, కాంగ్రెస్‌ను చీల్చి ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్, ఈ రెండు పార్టీలను వ్యతిరేకించే కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఒకటిగా మారి ప్రచారం సాగిస్తున్నాయి. వామపక్షాలు మాత్రం ఎవరితోనూ చేతులు కలపకుండా పోటీ చేస్తున్నాయి. సిపిఐ మద్దతుతో సిపిఎం పోటీ చేస్తోంది. ఇక బిజెపి నేరుగా ఎవరికీ మద్దతు ఇవ్వవలేదు. విపక్షాల ఓట్లు చీలకుండా బిజెపి పోటీకి దూరంగానే ఉండడం ద్వారా టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులకు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. టిఆర్‌ఎస్ ఒకవైపు, విపక్షాలన్నీ ఒకవైపు చేరి చేస్తున్న పోటీ రసవత్తరంగా మారింది.
పాలేరు ప్రయోగం విజయవంతం అయితే సాధారణ ఎన్నికల నాటికి విపక్షాలు ఏకమై పోటీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. పరోక్షంగా మద్దతు ఇవ్వడం, పంచాయితీల్లో మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయడం వేరు, అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ వేరుగా ఉంటుందని, విపక్షాల ఐక్యత కచ్చితంగా టిఆర్‌ఎస్ దూకుడును తగ్గిస్తుందని విపక్షాల నాయకులు నమ్ముతున్నారు.

చిత్రం
ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయ. ఇందుకు పాలేరు ఉపఎన్నిక మినహాయంపు కాదని రుజువు చేసే పోస్టర్ ఇది. చిరకాల రాజకీయ ప్రత్యర్థులు వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్, దివంగత ఎన్టీఆర్ కూడా ఈ పోస్టర్‌పై దర్శనమివ్వడం విచిత్రం