రాష్ట్రీయం

వరంగల్ ఉప ఎన్నికలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘునాథపల్లి, నవంబర్ 20: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో విధులు నిర్వర్తించడానికి వరంగల్ జిల్లా రఘునాథపల్లికి వచ్చిన మెదక్ జిల్లా చిరాకులపల్లి పోలీసుస్టేషన్‌కు చెందిన పిసి నెంబర్ 1574 గల మునిగెల రాజ్‌కుమార్(48) మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఉప ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌లో విధులు నిర్వర్తించడానికి రఘునాథపల్లికి వచ్చిన రాజ్‌కుమార్ తహశీల్దార్ కార్యాలయంలో ఇతర సిబ్బందితో కలిసి బస చేశాడు. ఉదయం స్నానం చేయడానికి బాత్‌రూమ్‌కు వెళ్లగా ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బాత్‌రూమ్‌కు వెళ్లిన రాజ్‌కుమార్ ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో తోటి సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా కుప్పకూలి బాత్‌రూమ్‌లో పడి ఉన్నారు. రాజ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి తోటి సిబ్బంది ప్రయత్నించగా ఆయన అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలుపగా జనగామ రూరల్ సిఐ వాసాల సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి సమీక్షించారు. మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.