రాష్ట్రీయం

ముంపు బాధితులు పిటిషన్ వేస్తే పరిశీలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పోలవరం ప్రాజెక్టు ముంపుప్రభావిత నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సామాజికవేత్త పెంటపాటి పుల్లారావువేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ముంపునిర్వాసితును నూత న భూసేకరణ చట్ట పరిధిలోకి తీసుకురావాలంటూ ఈ పిటిషన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌తో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. ముంపుబాధితులు ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే అప్పుడు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటమని బెంచ్ స్పష్టం చేసింది. అనంతరం పుల్లారావు మాట్లాడుతూ బాధితులతో కలిసి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.