రాష్ట్రీయం

నీట్‌పై రివ్యూ పిటిషన్: గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు(నీట్) నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొనగా, సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. నీట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, అయితే ఎంసెట్ నిర్వహణ కోసం ఏర్పాట్లు అన్నీ చేసినందున ఈ ఏడాదికి సడలింపు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరుతామని తెలంగాణ వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరానికి సడలింపును కోరుతూ సుప్రీంకోర్టులో ఆప్పీల్ చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతి అందిన తరువాత న్యాయ సలహా తీసుకుని ముందుకు పోతామని చెప్పారు.
ఆందోళన అక్కర్లేదు: గంటా
ఎమ్సెట్ ను యథాతథంగా 29వ తేదీన నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. నీట్ నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిశీలిస్తామని, ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయంలో విద్యార్ధులు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పాఠం రాగానే ప్రభుత్వ పరంగా స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. హైదరాబాద్ సెంటర్‌లో సైతం ఆంధ్రా ఎమ్సెట్ యథాతథంగా జరుగుతుందని చెప్పారు.